English | Telugu
ఆదిరెడ్డి ఒంటరితనం.. పట్టించుకోని హౌస్‌మేట్స్!
Updated : Nov 15, 2022
బిగ్ బాస్ హౌస్ లో నుండి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ బయటకి వెళ్లిపోవడం తెలిసిందే. కాగా హౌస్ నుండి వెళ్లినవారికి మరియు హౌస్ మేట్స్ కి అంత స్నేహం మొదలవ్వలేదనే చెప్పాలి. కాబట్టి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని అందరు లైట్ తీసుకున్నారు. కాని పది వారాలుగా కొనసాగి, ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని చాలా మిస్ అవుతున్నారు.
అయితే ఇనయా మాత్రం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సూర్యని చాలా సార్లు గుర్తుచేస్తోంది. అలాగే ఆదిరెడ్డి తనకి అత్యంత దగ్గరైన గీతుని మర్చిపోలేకపోతున్నాడు. తను హౌస్ నుండి వెళ్లినప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు. అదే విషయమై తనలో తాను మాట్లాడుకుంటూ "గీతు, నాకు హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి అని అనేది తనే వెళ్లిపోయింది. అలాగే ఆదిత్య, 'నువ్వు గాడ్ ఇచ్చిన గిఫ్ట్' సోదరా అంటు సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. హౌస్ లో సపోర్ట్ చేసేవాళ్ళే లేరు బిగ్ బాస్" అంటు బాధపడుతూ కనిపిస్తున్నాడు.
కాగా హౌస్ లో కంటెస్టెంట్స్ ఇండివిడ్యువల్ గా కాకుండా జట్లుగా విడిపోయి ఉండడం. గత రెండు వారాలుగా చూస్తూనే ఉన్నాం. 'శ్రీసత్య, ఫైమా, శ్రీహాన్, రేవంత్' ఒక టీం గా, ఎప్పుడు ఒకే దగ్గర ఉండడం. అలాగే కీర్తి భట్, ఇనయా ఒక టీంగా, మెరీనా-రోహిత్ లు ఒక దగ్గర ఉన్నారు. ఆదిరెడ్డి మాత్రం ఎప్పుడు సింగల్ గానే ఉంటూ, కెమెరాలలో చూస్తూ తన బాధని పంచుకుంటున్నాడు. హౌస్ లో మొదటి వారం నుండి గీతక్క..గీతక్క అంటూ గీతుతోనే ఉండేవాడు. ఇప్పుడు ఎవరు హౌస్ లో సపోర్ట్ లేకపోవడంతో ఒంటరి గా ఫీల్ అవుతున్నాడు. రాబోయే రోజుల్లో అయిన ఆదిరెడ్డి మిగత హౌస్ మేట్స్ తో కలిసి మెలిసి ఉంటాడో? లేదో? చూడాలి.